బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య: ఏడాదిలో నలుగురు
హైదరాబాద్: బాసర ఆర్జీయూకేటీలో మంగళవారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థి జాదవ్ బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ఆ యువకుడిది సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌గా అధికారులు గుర్తించారు.
యువకుడి మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బబ్లూ వ్యక్తిగత కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. బబ్లూ ఆత్మహత్య గురించిన సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు అందించారు.

కాగా, ఈ ఏడాదిలో బాసర ట్రిపుల్ ఐటీలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు తెలిపారు. విద్యాలయాల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈరోజే హైదరాబాద్ ఐఐటీలోనూ ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి శివారు కందిలో గల ఐఐటీ హైదరాబాద్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడితో మమైత నాయక్(21) అనే విద్యార్తిని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విద్యాలయంలోనే చదువుతున్న విద్యార్థి కార్తీక్ జులై 17న అదృశ్యమై.. విశాఖపట్నం బీచ్‌లో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం.
సంగారెడ్డి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత నాయక్ జులై 26న ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరారు. సోమవారం తన గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మొదట చున్నీతో ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. చున్నీ తెగిపోతుందేమోనని.. తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకుంది.
ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా, 'నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడి గురవుతున్నాను' అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తల్లిదండ్రులు మాత్రం ర్యాగింగ్ వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. కాలేజీ యాజమాన్యం మాత్రం అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేసింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications