రైలుకు ఎదురెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్: వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన చందానగర్, లింగంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. స్థానికులు, మృతుడి సహోద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలానికి చెందిన కొండా వెంకట్ రెడ్డి (30) గచ్చిబౌలిలోని డిఎస్‌టి వరల్డ్ సాఫ్ట్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

అతనికి రెండేళ్ల క్రితం వివామైంది. భార్యతో కలిసి మణికొండలో అతడు నివాసం ఉంటున్నాడు. కాగా, మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చందానగర్ రైల్వేస్టేషన్ నుంచి లింగంపల్లి వైపు వెళుతున్న రైలుకు వెంకట్ రెడ్డి ఎదురుగా వెళ్లటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

A techie in Hyderabad allegedly committed suicide

సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వద్ద ఉన్న ఐడి కార్డు, ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించారు. కాగా, వెంకట్ రెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, అందరితో కలిసి మెలిసి ఉండేవాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావటం లేదని తెలిపారు.

శ్రీలంకకు చెందిన ఇద్దరి అరెస్ట్: కిలోన్నర బంగారం పట్టివేత

శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇద్దరు శ్రీలంక దేశస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+