దారుణం: మహిళపై అత్యాచారం, హత్య?
హైదరాబాద్: నగరంలోని పెద్ద అంబర్‌పేట రింగు రోడ్డు దగ్గర దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దుండగులు బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లాలో దారుణం
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. స్నేహితులే ఒక యువకుడిని అమానుషంగా కొట్టి చంపేశారు. పూడూరు మండలం మంచన్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు కలిసి మిత్రుడైన మరో యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ దారుణ హత్య
మహబూబ్‌నగర్ జిల్లాలోని బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి దగ్గర ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె మృతదేహాన్ని తగలబెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత కాల్చేశారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications