తెలుగువాళ్లం..: ఏపీ రైతు కుటుంబానికి తెలంగాణ పోలీస్ సాయం

Subscribe to Oneindia Telugu

నల్గొండ: రాష్ట్రాలుగా విడిపోయినా.. అన్నదమ్ములుగా కలిసే ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. రామన్నపేట సీఐ కె శ్రీధర్‌రెడ్డి ఏపీ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలబడ్డారు.

కుటుంబ పెద్దను కోల్పోయిన ఏపీలోని కడపకు చెందిన ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. తన సహచరులతో కలిసి రూ.35 వేలను సమీకరించి చెక్కు రూపంలో ఆ కుటుంబానికి పంపించారు.

జూన్ 8న కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి తన పక్కనే ఉన్న పొలం రైతుకు నారుమడి దున్నేందుకు తన ఎద్దులతో కలిసి వెళ్లాడు.

A telangana police helped AP farmer

మడిలో పని చేసే సమయంలో పిడుగుపాటుకు గురై ఎద్దులతో సహా అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన సీఐ శ్రీధర్‌ రెడ్డి.. ఆ బాధిత కుటుంబాన్ని ఏలాగైనా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తన సహచర సిబ్బందితో కలిసి రూ.35 వేలు పోగుచేసి.. చెక్కు రూపంలో దానిని కమలాపురం పోలీసుస్టేషన్‌కు పంపించారు. కాగా, ఈ చెక్కును స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి భాధిత రైతు కుటుంబసభ్యులకు బుధవారం అందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A telangana police has been helped a Andhra Pradesh farmer's family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి