సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ గుడ్ న్యూస్..!

భారతీయ రైల్వేను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" (ABSS) ద్వారా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను రూ. 2,737 కోట్లతో ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2023 ఆగస్టు, 2024 ఫిబ్రవరిలో ముఖ్యమైన శంకుస్థాపనలు చేశారు.

ఈ విస్తృత ప్రణాళికలో భాగంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కూడా అత్యాధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపట్టారు. ఈ స్టేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇది కేవలం రవాణా కేంద్రంగా మాత్రమే కాక, ప్రసిద్ధ శ్రీ రామచంద్ర స్వామి ఆలయంకు ప్రవేశ ద్వారంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు, పర్యాటకులు ఈ స్టేషన్ ద్వారా భద్రాచలాన్ని సందర్శిస్తారు.

a-total-of-40-railway-stations-in-telangana-have-been-selected-under-the-amrut-bharat-station-sche

చారిత్రక ప్రాధాన్యత
భద్రాచలం రోడ్ స్టేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. నిజాం హయాంలో బొగ్గు రవాణా కోసం ఈ స్టేషన్ నిర్మించబడింది. అనంతరం హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి నగరాలతో కనెక్టివిటీ పెరిగి, ఇది కీలకమైన రైల్వే హబ్‌గా మారింది. ఇటీవల భద్రాచలం రోడ్ - సత్తుపల్లి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించబడింది, ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ , దక్షిణ మధ్య రైల్వే సంయుక్త ప్రాజెక్టుగా అభివృద్ధి చెందింది.

పురోగమిస్తున్న అభివృద్ధి పనులు
ఈ స్టేషన్‌ను రూ. 25.41 కోట్ల అంచనా వ్యయంతో మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు, అధునాతన వెయిటింగ్ హాల్స్, మరుగుదొడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 45% పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

స్టేషన్ ముఖద్వారం నూతన రూపంలో మెరుగుదల ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రవేశ ద్వారాన్ని ఆకర్షణీయంగా రూపుదిద్దుతున్నారు. 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఒక లిఫ్టు, ఒక ఎస్కలేటర్, ప్లాట్‌ఫారాల ఉపరితల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంతే కాకుండా అదనపు కప్పులు ఏర్పాటు, టాయిలెట్ల మెరుగుదల, కొత్త టాయిలెట్ బ్లాకులు (దివ్యాంగులకు అనుకూలంగా), గ్రీనరీ పెంపకం, ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రాంగణంలో మార్పులు, స్థానిక కళలు, సంస్కృతి ప్రతిబింబించే చిత్రాలు వంటి వర్క్ వేగంగా జరుగుతుంది. స్పష్టమైన కోచ్ , రైలు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

a-total-of-40-railway-stations-in-telangana-have-been-selected-under-the-amrut-bharat-station-sche

సగటున రోజూ 8020 మంది ప్రయాణికులు
భద్రాచలం రోడ్ స్టేషన్‌ను నాన్-సబర్బన్ గ్రేడ్-4 (NSG-4)గా వర్గీకరించారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఈ స్టేషన్ నుంచి సగటున రోజూ 8,000 పైచిలుకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వార్షికంగా ఇది సుమారు రూ. 7.61 కోట్ల ఆదాయం పొందుతోంది. ప్రస్తుతం మూడు జతల రైళ్లు ఈ స్టేషన్ నుంచి ప్రారంభమవుతున్నాయి.. మరో రెండు రైళ్లు ఇక్కడ ఆగుతున్నాయి.

భవిష్యత్తుకు దోహదం చేసే అభివృద్ధి
ఈ అభివృద్ధి కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాదు, భద్రాచలం ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తోంది. కొత్తగా ఏర్పడిన భద్రాచలం రోడ్ - సత్తుపల్లి రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా మరింత వేగవంతమవుతోంది. ఇది సింగరేణి కాలరీస్, దక్షిణ మధ్య రైల్వేల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది.

రాబోయే నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన అనుభవం కల్పిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా భద్రాచలం రోడ్ స్టేషన్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+