వడ్డీ కట్టలేదని మహిళపై రోకలిబండతో దాడి
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేదని ఓ దుర్మార్గు మహిళను తీవ్రంగా కొట్టాడు. రోకలిబండ, కరెంటు తీగలతో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, బాధితురాలు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అప్పు తీర్చనందునే ఇంత దారుణంగా దాడి చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు.
భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని బేగం బజార్ ఉస్మాన్ గంజ్ లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పూజ జనరల్ స్టోర్స్ భవనంలోని మూడు అంతస్తుల్లో మంటలు ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications