మామతో లైంగిక సంబంధం: భర్తను కట్టేసి చావగొట్టింది

మెదక్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిత్యం వివాహేతర సంబంధం ఆరోపణలతో గొడవపడుతున్నాడనే కారణంగా కాళ్లూచేతులు కట్టేసి భర్తపై భార్య, బావమరిది కలిసి రోకలితో చితకబాదారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా మనూరు మండల పరిధి బోరంచలో మంగళవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బోరంచకు చెందిన ఎం రాజు(32)ను ఇంట్లో బంధించి భార్య బసమ్మ, బావమరిది అనిల్‌ కలిసి కాళ్లూచేతులు కట్టేశారు. రోకలి, కట్టెలతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రాజు కేకలు వెయ్యడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. వారెంత అరిచినా తలుపులు తెరవకపోవటంతో పోలీసులకు సమాచారం అందించారు.

crime

మనూరు ఎస్సై ఏడుకొండలు సిబ్బందితో అక్కడికి వచ్చి.. కాళ్లు, చేతులు కట్టేసిన పరిస్థితిలో రక్తం మడుగులో అల్లాడుతున్న రాజును చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడి కట్లు విప్పి ఖేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తలకు బలమైన గాయాలు కావడంతో 20వరకు కుట్లుపడ్డాయి. కాగా, రాజు భార్య బసమ్మ, బావమరిది అనిల్‌ పరారీలో ఉన్నారు. రాజు తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

మామతో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే దాడి

ఇది ఇలా ఉండగా, బసమ్మకు తన తండ్రితో వివాహేతర సంబంధం ఉండటంతో ఇంట్లో నిత్యం గొడవ జరిగేదని, మందలించినా వినకపోవడంతో రోజూ తాగివచ్చి గొడవపడేవాణ్నని బాధితుడు రాజు చెప్పాడు. దీంతో తనను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి తన భార్య తమ్నుణ్ని రప్పించిందని తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+