కల్తీ కల్లు దొరక్క.. యాసిడ్‌తాగి మహిళ మృతి: కోతుల దాడిలో వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్: వూట్కూరు మండల కేంద్రానికి చెందిన మహిళ హైదరాబాద్‌లో కల్లీ కల్లు దొరక్క ఇంట్లో ఉన్న యాసిడ్ తాగి మృత్యువాత పడింది. మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు.
గ్రామస్థుల తెలిపిన ప్రకారం... వూట్కూరుకు చెందిన మాణిక్యమ్మ(58) వారం కిందట హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న కుమారుడు శివశంకర్ వద్దకు వెళ్లింది. కల్తీకల్లుకు బానిసైన ఆమె కల్లు దొరక్కపోవడంతో యాసిడ్ తాగింది.
తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 3వ తేదీన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

కోతుల దాడిలో వ్యక్తి మృతి
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కుక్కలు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కోనంపేటలో కుక్కలు స్వైరవిహారం చేయడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌లో కోతుల దాడిలో నార్ల సమ్మయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమ్మయ్యను చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications