‘గుడ్ బై మిస్టర్ శాడిస్ట్’!‘బంగారుతల్లీ క్షమించు’: సూసైడ్‌నోట్‌లో భర్త, కూతురునుద్దేశించి భార్య

Subscribe to Oneindia Telugu

ఖమ్మం: భర్త, అత్తింటివారు పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ వివాహత బలవన్మరణానికి పాల్పడింది. తన శవాన్ని అత్తింటివారు ముట్టుకోవద్దని, తన తల్లిదండ్రులే అంతిమ సంస్కారం చేయాలని తన సూసైడ్ నోట్‌లో స్పష్టం చేసింది. అంతేగాక, తన భర్తకు 'గుడ్ బై మిస్టర్ శాడిస్ట్' అని తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఆ మహిళను అత్తింటివారు ఎంత వేధించారో అర్థమవుతోంది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాలోని మధిర పట్టణంలోని వికలాంగులశాఖ విభాగంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రేమల్లె మురళీకృష్ణకు కృష్ణవేణి (35) అనే మహిళకు 12ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు 8ఏళ్ల కూతురు ఉంది. కాగా, గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణవేణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో విధుల నిమిత్తం మురళీకృష్ణ ఖమ్మం వెళ్లగా.. వారి కుమార్తె (8) స్కూల్‌ కు వెళ్లింది.

సూసైడ్ నోట్ స్వాధీనం..

సూసైడ్ నోట్ స్వాధీనం..

స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన బాలిక తలుపులు ఎంతసేపు కొడుతున్నా తీయకపోవడంతో దగ్గర్లోనే నివాసం ఉంటున్న కృష్ణవేణికి వరుసకు తమ్ముడు కిరణ్‌‌ను పిలిచింది. దీంతో అతడు కిటికీలోంచి చూడగా, కృష్ణవేణి ఉరివేసుకుని కనిపించింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి తలుపుపగులగొట్టి కృష్ణవేణి మృతదేహాన్ని కిందికి దించి, ఆమె రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణవేణి ఆవేదన..

కృష్ణవేణి ఆవేదన..

కుమార్తె పేరుతో ఆమె రాసిన సుదీర్ఘ లేఖలో తన భర్త శాడిస్టు వ్యవహారాన్ని వివరంగా రాసింది. కూతురునుద్దేశించి చెబుతూ... ‘బంగారుతల్లి నీకు అన్యాయం చేసి చనిపోతున్నా.. నన్ను ఎవరూ చంపలేదు నేనే చనిపోతున్నాను. ఏడవద్దు ఎవరినీ ఏడిపించవద్దు' అని రాసింది. తన శవాన్ని అత్తింటివారు కనీసం తాకకూడదని, అంతిమ సంస్కారాలన్నీ తన తల్లిదండ్రులే చేయాలని, అదే తన చివరి కోరిక అని లేఖలో పేర్కొంది.

శాడిస్టు భర్తపై ఇలా..

శాడిస్టు భర్తపై ఇలా..

అంతేగాక, ‘మిస్టర్ శాడిస్ట్ గుడ్ బై' అంటూ భర్తను ఉద్దేశించి ఈ లేఖ రాసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కుటుంబ కలహాలపై కిరణ్, ఆమె తల్లిదండ్రులు, అత్తమామలను విచారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly committed suicide in Khammam district due to harassment of husband and his family.
Please Wait while comments are loading...