భర్తను బెదిరించి రైల్వే స్టేషన్‌లో మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్: ముగ్గురు అరెస్ట్

నిజామాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన దంపతులను నలుగురు యువకులు బెదిరింపులకు గురి చేశారు. అనంతరం భర్తను బంధించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సోమవారం తెల్లవారుజామున 3గంటలకు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

A woman allegedly gangraped in Nizamabad

పాముకాటుతో దంపతుల మృతి

పాముకాటుతో దంపతులు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా చేర్యాలలో ఆదివారం జరిగింది. చేర్యాలకు చెందిన మహ్మద్ హుస్సేన్(38), రహెమూన్నీసా(34) దంపతులు పూలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం చేసి నిద్రించాక అర్ధరాత్రి రహెమున్నీసాకు పాము కరిచింది.

అరగంట అనంతరం మహ్మద్ హుస్సేన్‌ను కరిచింది. పాము కాటు వేసిన కొద్ది సమయంలో కడుపు నొప్పి రావడంతో కొడుకులకు విషయం చెప్పారు. వెంటనే వారు గదిలో లైటు వేసి చూడగా పాము కనిపించడంతో తల్లిదండ్రులను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హుస్సేన్, రహెమున్నీసాలను సిద్దిపేటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి చేరుకోగానే ఇద్దరూ మృతిచెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+