దారుణం: మహిళపై ఆటో డ్రైవర్లు గ్యాంగ్‌రేప్
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ఆటో డ్రైవర్లు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు శ్రీకాంత్(30), సురేష్(28) అన్నదమ్ములు.
బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓ మహిళ మంగళవారం సాయంత్రం వీరి ఆటో ఎక్కింది. ఆటోను దారి మళ్లించిన నిందితులు జీడిమెట్ల సమీపంలోని హెచ్ఎంటి కంపెనీ అటవీ ప్రాంతానికి మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శునకాన్ని ఢీ కొని యువకుడి మృతి
బైకుపై వేగంగా వెళ్తూ కుక్క అడ్డురావడంతో దానిని ఢీ కొని కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కంఛన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుభాష్‌నగర్‌కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగింది. మీర్‌పేటకు చెందిన ఆడమ్స్(22), బాలు, శివలు బైకుపై వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న బైకుకు కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ఆడమ్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శివ, బాలులను ఒవైసీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications