ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించటానికి వచ్చిన మహిళ ప్రాణాలు తీసిన లిఫ్ట్.. ఏం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించటానికి వచ్చిన మహిళ ప్రాణాలను తీసింది ఓ లిఫ్ట్. ఖమ్మం నగరంలోని తెలంగాణ ఆసుపత్రిలో లిఫ్ట్ లో పడి ఒక మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించడానికి వచ్చిన మహిళ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది.

లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ

లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ

అసలేం జరిగిందంటే వైరా మండలం గొల్లెన పహాడ్ కు చెందిన ప్రమీల అనే మహిళ తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించడం కోసం వచ్చింది .ఆసుపత్రికి వచ్చి అక్కడ చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్లడం కోసం లిఫ్ట్ వద్దకు చేరుకుంది. కాసేపు లిఫ్ట్ ముందు నిలబడింది. అయితే లిఫ్ట్ వచ్చిందేమోనని భావించిన ప్రమీల లిఫ్ట్ పూర్తిగా రాకముందే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. చూసుకోకుండా కాలేసింది.

లిఫ్ట్ ప్రమాదం లో మృతి చెందిన మహిళ

ఈ క్రమంలో ఆమె ఒక్కసారిగా క్రింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రమీలను చికిత్స అందించినప్పటికీ ఆమె మృతి చెందింది. పూర్తిగా లిఫ్ట్ తెరుచుకోకముందే చూసుకోకుండా డోర్ ఓపెన్ చేసి కాలు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. అయితే సహజంగా లిఫ్ట్ పూర్తిగా రాకముందు లిఫ్ట్ డోరు తెరుచుకోదు. కానీ అక్కడ లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతోనే ప్రమీల లిఫ్ట్ వచ్చిందని భావించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇక ప్రమీల లిఫ్ట్ డోర్ ఓపెన్ చెయ్యటం, ఆపై ఆమె లిఫ్ట్ లో పడిపోవటం దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

లిఫ్ట్ వినియోగం విషయంలో తస్మాత్ జాగ్రత్త

లిఫ్ట్ వినియోగం విషయంలో తస్మాత్ జాగ్రత్త

అయితే ఈ ఘటనపై ప్రమీల కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో లిఫ్ట్ ల వద్ద ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా సెక్యూరిటీని పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం చాలా చోట్ల ఇప్పటికే చోటు చేసుకున్నాయి. అందుకే లిఫ్ట్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లిఫ్ట్ రాకముందే అజాగ్రత్తగా డోర్ తెరిచి చూసుకోకుండా కాలు పెట్టకూడదని అంటున్నారు. ఇక చిన్నారులను సైతం లిఫ్ట్ విషయంలో జాగ్రత్తగా చూడాలని చెప్తున్నారు.

English summary
A woman was seriously injured after falling in a lift at a Telangana hospital in Khammam city. She died while receiving treatment in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X