కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెలకు రూ. 80వేల ఉద్యోగాన్ని మాన్పించి భర్త చిత్రహింసలు: మహిళా టెక్కీ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బెంగళూరు: తనపై తన భర్త అనుమానం పెంచుకుని తరచూ చిత్రహింసలకు గురిచేయడంతో అవమానంగా భావించిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కరీనంగర్ జిల్లా కాపువాడకు చెందిన మృతురాలు శరణ్య(25) తల్లిదండ్రులు మోహన్, విజయలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. వారి చిన్న కుమార్తె శరణ్య(25)ను గోదావరిఖని ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ రాజమౌళి కుమారుడు ఎం మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో పెళ్లి చేశారు. రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారం, 2కిలోల వెండి, రూ.30 లక్షలు విలువ చేసే రెండు గుంటల స్థలం కట్నం కింద ఇచ్చారు.

women-suiscide

కాగా, పెళ్లికి ముందు శరణ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేది. ఆమెకు నెలకు రూ.80 వేలు జీతం వచ్చేది. అయితేర ఉద్యోగం మాన్పించిన భర్త మధుకర్.. శరణ్యను తనతో పాటు బెంగళూర్ తీసుకెళ్లాడు. ప్రస్తు తం ఆమె 7నెలల గర్భిణి. బెంగళూరు వెళ్లాక మధుకర్ భార్యను మానసిక శారీరక వేధింపులకు గురి చేసేవాడు.

ఉద్యోగానికి వెళ్లే ముందు భార్య ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడకూడదని ఫోన్‌కు లాక్ చేసేవాడు. అంతేగాక, ఆఫీసుకు వెళ్లేముందు ఆమెను ఓ గదిలో బంధించి బయట తాళం వేసుకుని వెళ్లవాడు.

కాగా, ఏప్రిల్ 25న కరీంనగర్‌లో శర్యణకు శ్రీమంతం చేశారు. బెంగళూరుకు తిరిగి వెళ్లే సమయంలో తన భర్త వేధిస్తున్న తీరును తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యాంతమైంది శరణ్య. అయితే, తల్లిదండ్రులు కూతురికి సర్దిచెప్పి పంపారు.

ఈ నేపథ్యంలో భర్త మధుకర్, అత్తింటివారు రకరకాలుగా వేధిస్తుండటంతో తాళలేక తమ కుమార్తె మే 3న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని శరణ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశామని తెలిపారు.

అయితే అల్లుడు మధుకర్ తన పలుకుబడితో కేసును తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన తమ అల్లుడు, అతని కుటుంబసభ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను వారు వేడుకున్నారు.

English summary
A woman techie allegedly committed suicide due to her husband harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X