పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రక్తపు మడుగులో మహిళా టెక్కీ
లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
హైదరాబాద్: లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఆ మృతురాలు సాప్ట్‌వేర్ ఇంజినీర్ కావ్య అని, ఆమె మాదాపూర్‌లోని డీఎల్ఎఫ్ సంస్థలో పని చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆమె కర్ణాటకకు చెందిన యువతి అని చెప్పారు.

రోడ్డు ప్రమాదమా? లేక ఎవరైనా చంపేసి ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆమెపై ఎవరైనా అఘాయిత్యం చేసి చంపేసి ఇక్కడ పడేశారా? అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications