చేతబడి చేశావంటూ యువతి చితి వద్దే కొట్టిచంపిన కుటుంబ సభ్యులు!

ప్రపంచమంతా అంత్యంత శక్తివంతమైన టెక్నాలజీ అందుకుని ఆధునిక పోకడలకు వెళుతుంటే... దేశంలోని పలు ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడుతోంది. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం,సామాజిక వేత్తలు చేస్తున్న ప్రయత్నాలు బుడిదలో పోసిన పన్నీరవుతోంది. ఫలితంగా మూఢనమ్మకాలు,చేతబడుల ఆరోపణల్లో యువతి,యువకులు సైతం బలౌతున్నారు. గ్రామాలు,పట్టణాలు అనే తేడా లేకుండా మూఢవ్యవస్త కొనసాగుతునే ఉంది.

ఒకే చితిపై ఇద్దరి శవాలు

ఒకే చితిపై ఇద్దరి శవాలు

ఈనేపథ్యంలోనే మరో యవకుడు గ్రామస్తుల చేతిలో బలయ్యాడు. చేతబడి కారణంగా యువతి చనిపోయిందని భావించిన గ్రామస్తులు,దానికి కారణం అదే గ్రామానికి చెందిన మరో యువకుడు నమ్మిన ప్రజలు దారణంగా కొట్టి చంపారు.అనంతరం యువతి కాష్టం మీదే కాల్చి వేసిన దారుణ సంఘటన హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట ప్రాంతంలో జరిగింది.సాధరణంగా ఒకే చితిమిద ఇద్దరి శవాలను కాల్చే సంస్కృతి హిందూ సమాజంలో ఉండదు. మూఢనమ్మకాల మాయాలో పడి యువకుడిని సైతం యువతి చితిపైనే కాల్చారు.దీంతో ఆ సంఘటన సంచలనంగా మారింది.

 చేతబడి కారణంగా మృతి చెందిన యువతి...?

చేతబడి కారణంగా మృతి చెందిన యువతి...?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శామీర్‌పేట మండలం అద్రాస్‌పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది.అయితే ఆమే అనారోగ్యానికి కారణం చేతబడి కుటుంభసభ్యులు నమ్మారు. యువతిపై చేతబడి ప్రయోగాలను చేసింది అదే గ్రామానికి చెందిన బోయిన అంజనేయులు అనే యువకుడని గ్రామస్తులు బలంగా నమ్మారు. అయితే అనారోగ్యం తీవ్రం కావడంతో రెండు రోజుల క్రితం చనిపోయింది. దీంతో ఆమేకు బుధవారం దహన సంస్కారాలు నిర్వహించారు.

చేతబడికి కారణంటూ యువకుడిని కొట్టి చంపిన వైనం

చేతబడికి కారణంటూ యువకుడిని కొట్టి చంపిన వైనం

లక్ష్మి మృతితో కుటుంభ సభ్యులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఎలాగైన లక్ష్మి చావుకు కారణమైన యువకున్ని చంపాలని నిర్ణయించారు.ఇందులో భాగంగానే చేతబడి ఆరోపణలు ఎదుర్కోంటున్న యువకుడు చావు దగ్గరకి వస్తాడని అంచనా వేశారు. దీంతో అక్కడే చంపివేయాలని భావించారు. అనుకున్నట్టుగానే యువకుడు కాష్టం వద్దకు వచ్చాడు దీంతో ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసి,విచక్షణ రహితంగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే చని పోయాడు. అనంతరం యువతిని కాల్చిన చితిపైనే యువకుడిని సైతం కట్టేల్లో వేసి కాల్చివేశారు. అయితే ఇంత జరుగుతున్నా గ్రామస్తులు మాత్రం వేచి చూశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+