హైదరాబాద్ విమానాశ్రయంలో ఆత్మహత్యకు యత్నించిన యువతి: ఇలా కాపాడారు(వీడియో)

హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్ వద్ద రెయిలింగ్ నుంచి కింది దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. అయితే, అక్కడేవున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బందితోపాటు కొందరు ఆమెను కాపాడారు.

ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ సమయంలో మహిళ తనతో పాటు ఉన్న మగ స్నేహితుడితో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సరైన సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది, అక్కడున్నవారు స్పందించి ఆమెను అడ్డుకుని పైకి లాగారు.

Hyderabad airport;

ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించిన యువతి.. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిపోయింది అని శంషాబాద్ విమానావ్రయం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. యువతికి ఏమీ కాకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానాశ్రయంలో తొలిసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

కాగా, ఆ యువతి ఆత్మహత్యకు యత్నించిన దృశ్యాలు, ఆమెను కాపాడిన దృశ్యాలు అక్కడున్నవారు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సరైన సమయంలో స్పందించి ఆమెను కాపాడిన సీఐఎస్ఎఫ్, ఇతర ప్రయాణికులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

పొట్టిగా ఉన్నందుకే పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

పొట్టిగా ఉన్న కారణంగానే తనకు ఇప్పటికీ పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జార్ఖండ్‌లోని రాంచీ సమీప పుండగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల మూడు సంబంధాలు వెనక్కి వెళ్లిపోవడంతో శ్వేత(22) తీవ్ర మనస్తాపానికి గురైంది. తాను పొట్టిగా ఉన్నందువల్లే పెళ్లి జరగడం లేదిన ఆవేదన చెందింది.

కుటుంబసభ్యులు ఆమెకు ఎంత చెప్పినా.. నిరాశలో కూరుకుపోయింది. తల్లిదండ్రులు బీహార్‌లోని అరవల్‌లో నివాసం ఉండగా.. అక్క శిల్పతో కలిసి శ్వేత ఇక్కడే ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్వేత ఆత్మహత్య చేసుకుంది. గమనించిన పొరిగింటివారు బాధితురాలి సోదరి శిల్పకు సమాచారం అందించారు. తాను కుటుంబం పనిమీద గురువారం రాత్రి బయటకు వెళ్లానని.. పొరిగింటి వ్యక్తులు ఫోన్ చేసి శ్వేత ఆత్మహత్య గురించి చెప్పినట్లు శిల్ప వెల్లడించింది. పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+