దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బేగరి సిద్దూ అలియాస్(19) బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికొచ్చిన బాలిక పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సదాశివపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు బాలిక తాత చెప్పారు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని మునిపల్లి ఎస్ఐ అశోక్ చెప్పారు.












Click it and Unblock the Notifications