అర్ద్రరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!!
తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మంగళవారం అర్ద్రరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని సమ్మె నిర్ణయం తప్పలేదని చెబుతున్నారు. హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదంటున్న ప్రవేట్ హాస్పిటల్స్ నిర్ణయంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు అర్ద్రరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించింది. తాము ఎంతో కాలంగా పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం ప్రయత్నం చేస్తున్నామని వివరించింది. పెండింగ్ బిల్లుల విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది.

గత జనవరి లోనూ ఇదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చలు జరిపి సుమారు రూ.120 కోట్ల వరకు పెండింగ్ బకాయిలను చెల్లించింది. అయితే ఏడాది కాలంగా ఉన్న పెండింగ్ బకాయిల్లో కేవలం 45 రోజులకు సంబంధించినవే చెల్లించారని, మిగిలిన వాటిని కూడా ఈ నెలాఖరులోగా చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి.
కానీ, దీనిపై వైద్యశాఖ నుంచి స్పష్టత రాకపోవడంతో.. అదే రోజు నుంచి సేవలను నిలిపివేశాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నెట్‌వర్క్ ఆస్పత్రులు అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని, ఔషధాలు, సర్జికల్స్ సరఫరాదారులు సైతం వాటి సరఫరా నిలిపివేశారని తెలిపింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా పెండింగ్ బకాయులను వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని కోరింది. దీంతో.. ఈ అర్ద్రరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్ వర్క్ ఆస్పత్రుల తాజా నిర్ణయం పైన ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. అటు ప్రయివేటు కాలేజీల ఫీజుల రీయంబర్సమెంట్ వ్యవహారం పైన ప్రభుత్వం చర్చలు చేస్తోంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications