వాజ్‌పేయి పుట్టినరోజు: సంబరాల్లో శ్రేణులు (ఫోటోలు)
హైదరాబాద్: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ నాయకులు ఆయన పుట్టినరోజుని ఘనంగా నిర్వహించారు.
కేంద్రప్రభుత్వం వాజ్‌పేయికి భారతరత్న ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వాజ్‌పేయి చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ సంబరాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అంతక ముందు వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రక్తదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా రక్తదానం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయకు కిషన్ రెడ్డి కేక్ తినిపించారు.

వాజ్‌పేయి పుట్టిన రోజున సంబరాల్లో బీజేపీ శ్రేణులు
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు కేక్ తినిపిస్తున్న శ్రేణులు.

వాజ్‌పేయి పుట్టిన రోజున సంబరాల్లో బీజేపీ శ్రేణులు
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు.

వాజ్‌పేయి పుట్టిన రోజున సంబరాల్లో బీజేపీ శ్రేణులు
వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రక్తదాన కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా రక్తదానం చేశారు.

వాజ్‌పేయి పుట్టిన రోజున సంబరాల్లో బీజేపీ శ్రేణులు
వాజ్‌పేయి చిత్రపటాలను ప్రదర్శించారు. ఈ సంబరాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications