ఏసీ బస్సులో దర్జాగా కూర్చొని గంజాయి స్మగ్లింగ్: ఏం తెలివిరా అయ్యా!
Ganja Seized: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వోల్వో ఏసీ బస్సులో తరలిస్తున్న సుమారు 20.600 కేజీల గంజాయిని రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం చాకచక్యంగా పట్టుకుంది. ఈ గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన నిందితుడు నాభిన్ నాయక్ అలియాస్ హరిని అరెస్టు చేశారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నాభిన్ నాయక్ అలియాస్ హరి, 4 పెద్ద బ్యాగులలో 20 కేజీలకు పైగా గంజాయిని నింపి, వాటిని వోల్వో బస్సులోని లగేజ్ బాక్స్‌లో పెట్టాడు. తాను మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా ఏసీ బస్సులో కూర్చుని హైదరాబాద్‌కు వస్తున్నాడు.గతంలో కూడా ఈ నిందితుడు భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.

రామోజీ ఫిలిం సిటీ వద్ద పట్టివేత
నిందితుడు నాభిన్ నాయక్ ఒడిశా నుంచి గంజాయిని తీసుకువస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఏఈఎస్ జీవన్ కిరణ్, సీఐలు సుభాష్ చందర్ , ఇతర సిబ్బందితో కలిసి ఒక బృందం రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించింది.బస్సులోని లగేజ్ బాక్స్‌ను తనిఖీ చేయగా, అందులో నాలుగు బ్యాగులను నింపి ఉంచిన20.600 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు నాభిన్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అధికారులకు అభినందనలు
పట్టుకున్న గంజాయిని, నిందితుడిని అధికారులు హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం, డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్లు ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఆపరేషన్‌లో ఏఈఎస్ జీవన్ కిరణ్, సీఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్ఐలు వెంకట్, రవి, అఖిల్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications