హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏసీబీ వలలో మరో అవినీతి చేప, ప్రమాదవశాత్తూ ఎలక్ట్రీషియన్ మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏసీబీ వలకి మరో అవినీతి చేప చిక్కింది. ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా వరంగల్ డీపీవోని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం జిల్లా పంచాయితీ అధికారి సోమ్లా నాయక్‌ను సంప్రదించగా ఆయన లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ACB arrested warangal dpo in bribe case

బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం రంగంలో దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమ్లా నాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమ్లా నాయక్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ అలీ, అటెండర్ సారంగ పాణిలను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

వీరి వద్ద నుంచి ఏసీబీ అధికారులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

ప్రమాదవశాత్తూ ఎలక్ట్రీషియన్ మృతి

ప్రమాదవశాత్తూ ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలోని మాణిక్యాల- ఎల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెంకన్న(32) అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ స్తంభం పైకి ఎక్కి కరెంటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.

English summary
ACB arrested warangal dpo in bribe case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X