వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21మందికి లుకౌట్?: రాజ్యాంగ సంక్షోభమొచ్చినా! వేం వద్దకు రాత్రి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చే అంశాన్ని ఏసీబీ పరిశీలిస్తోందని తెలుస్తోంది. మోరవైపు, ఈ కేసులో దాదాపు 21 మందికి లుకౌట్ నోటీసులు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ కేసులో పలువురికి ప్రమేయం ఉన్న పలువురు అనుమానితులు దేశం వదిలి పారిపోకుండా ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. బుధవారం వీటిని జారీ చేయవచ్చునని చెబుతున్నారు.

ఇంతమంది పైన ఎల్ఓసీ జారీ చేయడం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నసమయంలోను ఎప్పుడు జరగలేదు. ఓటుకు నోటు రెండు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రాజేస్తోంది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీ చేశారు. విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు.

ఏసీబీ

ఏసీబీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఏసీబీ డీఎస్పీ సిద్ధిఖి, సునితా రెడ్డి.

ఏసీబీ

ఏసీబీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఏసీబీ డీసీపీ కోటిరెడ్డి దృశ్యం.

వేం నరేందర్ రెడ్డి

వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వేం నరేందర్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి వెళ్లారు.

వేం నరేందర్ రెడ్డి

వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వేం నరేందర్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి వెళ్లారు. తాను ఇప్పుడు రానని, తర్వాత వస్తానని చెప్పారు.

మరోవైపు, టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి ఆయనను విచారణ కోసం తమ వెంట రమ్మని కోరారు.

అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, ఈ సమయంలో రాలేనని ఆయన అభ్యంతరం చెప్పడంతో బుధవారం ఉదయం హాజరుకావాలని చెప్పారు. వేం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలోనే అనిశా అధికారులు తమ వెంట రమ్మని ఉంటరనే వూహాగానాలు వినిపిస్తున్నాయి.

అరెస్టయిన నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్‌లతోపాటు పరారీలో ఉన్న మరో నిందితుడు మత్తయ్య జెరూసలేంలతో సండ్ర నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరితో వరుసగా మాట్లాడటం ఏసీబీ అధికారులకు అనుమానం రేకెత్తించింది. దాంతో ఆయన వాంగ్మూలం నమోదు చేయాలని భావించారు.

రాజ్యాంగ సంక్షోభం తలెత్తినా...!

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరాసతో ఢీకొట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది.

ఓ వైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు వహిస్తుంటే, ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రమేయం ఉందని తెలంగాణ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో కొందరికి లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. ఏపీ కేబినెట్ జరగనుంది. ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదంటున్ారు.

English summary
The ACB has decided to take a decision against Chandrababu Naidu in the cash for vote case only after receiving a preliminary report from the APForensic Science Laboratory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X