హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి అధికారి ఆస్తులు రూ.12 కోట్లు: ఇంట్లో అత్యధునిక సెన్సార్ వ్యవస్థ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో తెలంగాణ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌లో బాయిలర్స్ విభాగం అధిపతిగా పని చేస్తున్న విజయ్ కుమార్ ఇంట్లో గురువారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించింది.

ఖమ్మం జిల్లాకు చెందిన విజయ కుమార్ 1989లో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విధుల్లో చేరాడు. తర్వాత బాయిలర్స్ విభాగానికి అధిపతి అయ్యాడు.

ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయన ఆస్తులు రూ.12 కోట్లు ఉన్నాయని గుర్తించారు.

ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

డిఎస్పీ సునీత, మరో అధికారి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మాదాపూర్ కావూరి హిల్సులోని ఆయన నివాసంతో పాటు మరో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు.

ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

ఈ దాడుల్లో రూ.12 కోట్ల విలువ చేస్తే ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇతను రెండు నెలల క్రితం నల్లకుంట నుంచి కావూరి హిల్సుకు వచ్చాడు.

 ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

విలాసవంతమైన ఆ ఇంట్లో సిసి కెమెరా వ్యవస్థతో పాటు అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

ఇంట్లోని అద్భుతమైన ఇంటీరియర్, ఫర్నీచర్‌కు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి ఖర్చు చేసి ఉంటారని అంటున్నారు.

 ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

కాగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏసీబీ అధికారులు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఇంట్లో సోదాలు చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

 ఏసీబీ సోదాలు

ఏసీబీ సోదాలు

ఆయన ఇంట్లో రూ.5.94 లక్షల క్యాష్, రూ.6 లక్షల విలువగల ఫిక్స్డ్ డిపాజిట్లు, మరో రూ.12 లక్షల విలువగల వస్తువులు, ఇతరత్రా స్వాధీనం చేసుకున్నారు.

English summary
Anti-Corruption Bureau (ACB) sleuths raided the Director of Boilers Department, P Vijay Kumar's houses in the city on Thursday and found him possessing assets disproportionate to known sources of his income.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X