మోడీ ఎందుకు పిలిచారో తెలియదు కానీ, దటీజ్ కేటీఆర్: మెగా ఫ్యామిలీ హీరో
హైదరాబాద్: అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మెట్రో రైలు ప్రారంభం కావడంతో పలువురు నెటిజన్లు తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ట్విట్టర్ అకౌంట్ ద్వారా సందేశాలు పంపించారు.
Recommended Video

మెట్రో నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దినందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సేవలను ప్రశంసిస్తూ హీరోలు, నెటిజన్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నటుడు సాయి ధరమ్ తేజ్ మంత్రి కేటీఆర్‌ను ఆకాశానికెత్తారు.

కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి ఇది చాలు
మెట్రో ప్రారంభంలో రిబ్బన్ కట్ చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు కానీ, ఆయన వచ్చాక రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి అది చాలు అని అయన అన్నారు.

బూర నర్సయ్య గౌడ్ స్పందించారు
టిఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా స్పందించారు. మరో మైలురాయిని అధిగమించామని, మంత్రి కేటీఆర్ చొరవతో మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని అందులో పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాపారవేత్తగా కురిపించారని, ఎక్కడా రాజకీయ నాయకుడిగా కనిపించలేదని, యువత ఐకాన్‌గా నిలిచారని మరొకరు ట్వీట్ చేశారు.

మొదటి రోజు చాలామంది ప్రయాణించే అవకాశం
కాగా, బుధవారం ఉదయం నుంచి మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్ స్టేషన్‌లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రతి పావు గంటకు ఓ రైలు
ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి.
మెట్రో కార్డుల విక్రయం మొదలుపెట్టిన తర్వాత మూడు రోజుల్లోనే 12 వేలకు పైగా అమ్మడయ్యాయి. తొలిరోజు మెట్రో రైలులో లక్ష మంది ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా మొదటి రోజే రైళ్ల సంఖ్యను పెంచాల్సి రావొచ్చు.

గంటలోపు ఆ చివరి నుంచి ఈ చివరకు
మియాపూర్-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ప్రస్తుతం గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే మెట్రోలోనైతే గంటలోపు చేరుకోవచ్చు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications