ఐఏఎస్ అధికారిణితో భర్త వివాహం: కంటతడి పెట్టిన నటి పూజిత
హైదరాబాద్: విజయ గోపాల్ తనతో మూడేళ్ల పాటు కాపురం చేసి ప్రస్తుతం తాను ఎవరో తెలియదని చెబుతున్నాడని, కొడుకును చూడాలని నటి పూజిత కంటతడి పెట్టారు. విజయగోపాల్ తన భర్తే అంటూ ఆమె అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు.
పోలీస్ స్టేషన్ వెళ్లిన ప్రతిసారి ఆధారాలు తీసుకు రావాలని చెబుతున్నారే తప్ప కేసు నమోదు చేయడం లేదని ఆమె వాపోయారు. తన భర్త మరో వివాహం చేసుకున్నాడనే పూజిత ఫిర్యాదు పైన దర్యాఫ్తు చేస్తున్నామని, నిపుణుల సలహా తీసుకుంటున్నామని, త్వరలో కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

కాగా, తన భర్త విజయగోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి తనకు ప్రాణహానీ ఉందని సినీ నటి పూజిత మరోసారి మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం నాడు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
విడాకులు ఇవ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని ఆమె ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరుతున్నారు.
నటి పూజిత తన భర్త విజయ గోపాల్ పైన ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండానే రేఖారాణిని పెళ్లాడారని ఆమె వారం రోజుల క్రితం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications