అవార్డు వెనక్కి ఇచ్చారా, నేను ఇవ్వను: నటి శోభన, వారికి చురకలు!

తిరువనంతపురం/హైదరాబాద్: ప్రముఖ నటి శోభన అవార్డును తిరిగిచ్చేది లేదని చెప్పారు. దాద్రీ ఘటన నేపథ్యంలో పలువురు రచయితలు, ప్రముఖులు అవార్డులను తిరిగి ఇచ్చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వారు అవార్డులు తిరిగి ఇచ్చేయడంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శోభన అవార్డును వెనక్కి ఇవ్వడంపై స్పందించారు. మంగళవారం నాడు ఓ విలేకరి.. శోభనను అవార్డును తిరిగి ఇచ్చేయటం గురించి ప్రశ్నించాడు.

చాలామంది రచయితలు అవార్డును తిరిగి ఇచ్చేశారా అని ఆమె ఆశ్చర్యపోయారు. ఏ అవార్డును ఎవరు, ఎందుకు వెనక్కి ఇచ్చారని విలేకరిని ప్రశ్నించారు. తాను తన అవార్డును వెనక్కి ఇవ్వనని చెప్పారు. అనంతరం విలేకరులు దాద్రీ ఘటన గురించి, రచయితలు అవార్డులు వెనక్కి ఇచ్చేయడంపై వివరించారు.

Actress Shobana has no idea of Dadri lynching!

మరోవైపు, పలువురు అవార్డులు వెనక్కి ఇవ్వడంపై ఆమె చురకలు కూడా అంటించారు. వారికి లేటు వయస్సులో అవార్డులు వచ్చాయేమో, అందుకే తిరిగి ఇచ్చారని చురకలు అంటించారు. నేను వెనక్కి ఇవ్వనని చెప్పారు.

కర్నాటకలో కన్నడ రచయిత కల్బుర్గి హత్య, యూపీలో దాద్రీ ఘటన నేపథ్యంలో పలువురు అవార్డులు వెనక్కి తిరిగి ఇచ్చిన విషయం తెలిసిందే.

అవార్డులు తిరిగి ఇచ్చేయడంపై కేంద్రమంత్రి వెంకయ్య సహా పలువురు రచయితల తీరును తప్పుబట్టారు. ఇదే రచయితలు తస్లీమా నస్రీన్ పైన దాడి జరిగినప్పుడు, ఆ తర్వాత జరిగిన పలు మత ఘర్షణల సమయాల్లో ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇప్పుడు మోడీ ప్రధాని అయినందునే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీని టార్గెట్‌గా రచయితలు అవార్డులు వెనక్కి ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+