Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హోదా లేకుండా అడ్మిషన్లా? కేసీఆర్ సర్కార్ విధానాలపై బండి సంజయ్ ఫైర్.!

హైదరాబాద్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. చివరకు విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రైవేటు వర్శిటీ హోదా రాకుండానే శ్రీనిధి, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలు నాలుగు వేల మంది విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుని వాళ్ల జీవితాలను నాశనం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్.

గురునానక్, శ్రీనిధి కాలేజీలకు ప్రైవేటు వర్శిటీ హోదా రాలేదు.. :విద్యార్థులకు న్యాయం చేయాలని ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. తక్షణమే బాధ్యులైన ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. మంగళవారం దిల్ సుఖ్ నగర్ లోని ఏబీవీపీ విభాగ్ కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ పోలీసుల దాడిలో గాయపడ్డ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పరామర్శించారు.

Bandi Sanjay Fire on the policies of KCR Sarkar.!

గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో 4 వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారు?:చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోంది. డబ్బు, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతోంది. డబ్బులిస్తే చాలు ఎవరి జీవితాలు నాశనమైనా డోన్ట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తోందన్నారు బండి సంజయ్. డబ్బులకు కక్కుర్తిపడి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం ఇయాళ ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలను కూడా ప్రమాదంలో నెట్టేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఎంసెట్ ఫలితాలు రాలేదని, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలు కాలేదని, అప్పుడే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల దందా మొదలుపెట్టిందని, అనుమతి లేకుండానే ప్రైవేటు యూనివర్శిటీల పేరుతో పెద్ద దందా జరుగుతోందని ఇది ఇంకా దుర్మార్గమన్నారు బండి సంజయ్.

కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా?:గురునానక్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇంతవరకు అటానమస్ (ప్రైవేట్ వర్శిటీ) హోదా రాలేదని, ఇప్పటి వరకు కనీసం అనుమతి కూడా రాలేదన్నారు బండి సంజయ్. అయినా ఆ కాలేజీల్లో ఇప్పటి నుండే ఇంజనీరింగ్ సీట్ల దందా మొదలైందన్నారు. తమది ప్రైవేట్ వర్శిటీ అని ప్రచారం చేసుకుంటూ వేలాది మంది విద్యార్థుల వద్ద అడ్మిషన్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నరని, ఈ రెండు కాలేజీల్లోనే ప్రత్యేక వర్శిటీలని చెప్పుకుంటూ దాదాపు 4 వేల మంది విద్యార్థుల నుండి ఇప్పటికే డబ్బులు కట్టించుకున్నయన్నారు బండి సంజయ్.

Bandi Sanjay Fire on the policies of KCR Sarkar.!

ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే..:ఈ దారుణంపై ఏబీవీపీ ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తోందని, ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలను కాపాడాలని ఏబీవీపీ ఆందోళన చేస్తోందన్నారు బండి సంజయ్. నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్ల పోరాడిన చరిత్ర ఉన్న సంఘం ఏబీవీపీదేనని, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉద్యమిస్తే ఆ విద్యార్థుల సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఈ సర్కారు సిగ్గు లేనిదని, ప్రజలు ప్రభుత్వం మీద ఉమ్మేస్తున్నా సిగ్గు రావడం లేదని, పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝూన్సీసహా నాయకులను అరెస్టు చేసి కేసులు పెట్టడమే కాకుండా, బెదిరిస్తున్నారని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+