వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దత్తత తీసుకుని దరిద్రంగా మార్చారు.!కొడంగల్ అభివృద్ది ఏది.?కేటీఆర్ పై విరుచుకుపడ్డి రేవంత్.!

|
Google Oneindia TeluguNews

వికారాబాద్/హైదరాబాద్ : కొడంగల్ నియోజక వర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నాక అధోగతి పాలయ్యిందని టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. టీఆరెస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని, మంత్రి తారక రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఘాటు వ్యాఖ్యలు చేసారు రేవంత్. పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆరెస్ ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదన్నారు. మిగిలినవన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ కు రేవంత్ సూటి ప్రశ్నలు..

మంత్రి కేటీఆర్ కు రేవంత్ సూటి ప్రశ్నలు..

కొడంగల్ అభివృద్దిపై శ్వేతపత్రం ఇవ్వాలి.. మంత్రి కేటీఆర్ కు రేవంత్ సూటి ప్రశ్నలు..
2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆరెస్ ఎమ్మెల్యే ఉన్నారని, నాలుగేళ్ళ కాలంలో ఏం అభివృద్ధి చేశారో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసగితే కొడంగల్ కు అభివృద్ధికి నిధులు వచ్చుడో శాసన సభ్యుడు సచ్చుడో తేలాలన్నారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలన్నారు రేవంత్ రెడ్డి.

ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న రేవంత్

ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న రేవంత్


కొడంగల్ ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న రేవంత్
కొడంగల్ అభివృద్దిలో సమగ్ర సమాచారం ప్రజలకు ఇవ్వలేకపోతే గ్రామ గ్రామాన పర్యటించి, టీఆరెస్ తీరును ఉతికి ఆరేస్తామన్నారు రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించింది కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని, కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదని అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ నిలదీసారు. కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ లు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు పీసిసి చీఫ్.

సోనియా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలన్న రేవంత్

సోనియా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలన్న రేవంత్


డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం.. సోనియా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలన్న రేవంత్
అంతే కాకుండా డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని, సోనియాగాంధీ పుట్టిన రోజుతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిన రోజన్నారు రేవంత్. డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమని, ఆ రోజు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని రేవంత్ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యత్వ కార్డుల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలని, డిసెంబర్ 9న రక్తదాన శిబిరాన్ని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్ ల వారీగా సమీక్షించి డిసెంబర్ 6 లోపు దాతల పేర్లు నమోదు చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.

స్వయంగా ధర్నా చేయనున్న రేవంత్, భట్టి

స్వయంగా ధర్నా చేయనున్న రేవంత్, భట్టి


రైతు సమస్యలపై వరస పోరాటాలు.. స్వయంగా ధర్నా చేయనున్న రేవంత్, భట్టి
సోనియా జన్మదిన సందర్బంగా వెయ్యి మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల బీమా చెక్కులను అందజేయాలని, పని విభజన చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా సోమవారం జిల్లా కేంద్రాలలో టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు ఉంటాయన్నారు. భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై వరస పోరాటాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే మండల, నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలు చేపట్టింది టీపీసీసీ. నేడు జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేయనున్నారు టీపిసీసీ శ్రేణులు. వికారాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి తదితరులు పాల్గొంటారు.

English summary
TPCC President Revanth Reddy said that Kodangal constituency has deteriorated after being adopted by Minister KTR.Revanth made harsh comments that this situation has arisen due to the adoption of Minister Taraka Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X