ట్యాపింగ్: బాబుకు వికీలీక్స్ ఎఫెక్ట్, కెసిఆర్ భయపడ్తున్నారా(పిక్చర్స్)
హైదరాబాద్: హ్యాకింగ్ కుట్రకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సమగ్ర విచారణ జరిపించాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ న్యాయవాద జేఎసీ నేతలు శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాద జేఎసీ కన్వీనర్ కొంతం గోవర్దన్ రెడ్డి మాట్లాడారు. ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని ఏపీ పోలీసులు సింగపూర్‌కు చెందిన ఒక హ్యాకింగ్ నిపుణుల బృందాన్ని సంప్రదించారని చెప్పారు.
తెలంగాణ నేతల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ జరిపేందుకు చేసిన కుట్ర వికీలీక్స్ కథనం ద్వారా బయపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.

అడ్వోకేట్ జెఎసి
తెలంగాణకు చెందిన 25 నుంచి 50 మంది ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిపేందుకు చేసిన కుట్ర విషయంలో సమగ్ర దర్యాఫ్తు జరపాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిపిన కుట్రలో ఇది భాగమని, బాబుపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

లోక్‌సత్తా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి దొరికిపోయిన చంద్రబాబు పైన చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కెసిఆర్ క్యాంపు కార్యాలయం వద్ద లోక్‌సత్తా శనివారం ధర్నా చేసింది.

లోక్‌సత్తా
చర్యలు తీసుకోవడంలో వెనుకాడటం పైన ఏమైనా లోపాయికారీ ఒప్పందం కుదిరిందా లేక మరో కారణంతోనైనా భయపడుతున్నారా అని ప్రశ్నించారు.

లోక్‌సత్తా
ఈ సందర్భంగా లోక్ సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోల్కర్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ సంభాషణలో ఉంది తన గొంతు కాదని ఇప్పటికీ చంద్రబాబు చెప్పలేదన్నారు.

లోక్‌సత్తా
అలాంటప్పుడు ఆయన పైన కేసు ఎందుకు నమోదు చేయలేదని లోక్ సత్తా ప్రశ్నించింది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications