హైదరాబాద్ లో ఇండిపెండెంట్ ఇల్లు ఇంత చీపా..?
ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఒక కలగానే మిగిలిపోతుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు కట్టుకునే పరిస్థితి ప్రస్తుతం లేకుండా పోయింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. ఇక ఉద్యోగం, ఉపాధి కోసం నగరాల బాట పట్టిన ప్రజలకు అద్దె ఇంట్లో కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏటేటా హైదరాబాద్ నగరంలో ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే హౌజ్ రెంట్లు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు భాగ్యనగరంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లు ధర పలికింది. అయితే హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో సామాన్య ప్రజలు ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా, ఫ్యూచర్ సిటీగా రూపాంతరం చెందుతోంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పెరిగిపోయింది. ఇటీవల రాయదుర్గంలో టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికింది. 18 ఎకరాల భూమిని వేలం వేయగా ఒక్క ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1357 కోట్లకు చేజిక్కించుకుంది. మరో 11 ఎకరాలకు వేలం ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గచ్చిబౌలి, కోకాపేట, మణికొండ, కొండాపూర్, మాదాపుర్, నానక్ రామ్ గూడ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అలాగే నగరం వ్యాప్తంగా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ హై రైజ్ టవర్స్ నిర్మిస్తున్నారు. వీటి ధర రూ. 1 నుంచి రూ. 2 కోట్ల రూపాయల నుంచి ప్రారంభం అవుతోంది.

ఇక హైదరాబాద్ మహా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగర శివారులోని కీసరగుట్ట ప్రాంతం సమీపంలో కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడుతున్నాయి. కీసర ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు రూ. 40 లక్షల రూపాయల నుంచే ప్రారంభం కానున్నాయి. కీసర ప్రాంతంలో 100 చదరపు అడుగుల్లో ఇళ్ల ధరలు రూ. 40 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుండగా రూ. 60 లక్షల రూపాయల వరకు పలుకుతున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి సమాచారం అందుతోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ ప్రాంతంలో ప్లాట్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.












Click it and Unblock the Notifications