హైదరాబాద్ TO షిర్డీ టూర్.. తక్కువ ధరకే IRCTC ప్యాకేజీ
ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి.. హైదరాబాద్ నుంచి నిత్యం వేలాదిమంది వెళ్తుంటారు. బస్సులు, రైళ్లలో లేదా సొంత వాహనాల్లో ఈ క్షేత్రానికి పయనిస్తుంటారు. అయితే సాధారణ, మధ్యతరగతి ప్రయాణికుల కోసం తక్కువ ధరకే షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC. ఈ నెలలోనే ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. 2 రాత్రులు, 3 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో సాగే ఈ టూర్ ను IRCTC అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.
'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో సాగే ఈ టూర్ ప్యాకేజీ ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 29, 2025 ఈ టూర్ అందుబాటులో ఉంది. రైల్వే సంస్థ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు రైలు ప్రారంభం అవుతుంది. రైలు నెంబర్ 17064. అలాగే కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది.
అలా రాత్రంతా ప్రయాణించాక రైలు నాగర్ సోల్ చేరుకుంటుంది. ఆ తర్వాత షిర్డీకి చేరుతుంది. హోటల్ లో బస అనంతరం షిర్డీ ఆలయంలో దర్శనం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్ర 5 గంటలకు హోటల్ నుంచి బయటకు వెళ్లి రాత్రి 8 గంటల వరకు నాగర్ సోల్ చేరుకుంటారు. అలా మళ్లీ రాత్రంతా జర్నీ తర్వాత తెల్లారి ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు కాచిగూడ చేరుకుంటారు. దీంతో యాత్ర ముగుస్తుంది.

టికెట్ ధరలు సింగిల్ షేరింగ్ కు రూ.7,890 గా ఉంది. అలాగే డబుల్ షేరింగ్ ధరలు రూ. 6660గా ఉంది. ఇక ట్రిపుల్ షేరింగ్ విషయానికి వస్తే దీని ధర రూ. 6640గా ఉంది. ఇక కంఫర్ట్ క్లాస్‌లో ధరలు ఓసారి పరిశీలిస్తే.. ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 4960గా ఉంది. డబుల్ షేరింగ్ ధర రూ. 4980 గా ఉంది. అలాగే సింగిల్ షేరింగ్ ధర రూ. 6220గా ఉంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications