వీడియో: కొల్లాపూర్‌ కాంగ్రెస్‌లో సెగ- ఆయనకు టికెట్‌పై క్యాడర్ భగ్గు

నాగర్ కర్నూల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections 2023) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు బీఫామ్‌లను అందజేశారు.

After allocating ticket to Jully Krishna Rao, congress workers protest at Kollapur

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం (Vemula Veeresham), కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల తొలి జాబితా (Telangana Congress first list 2023)ను విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీలిమా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు.

అదే సమయంలో- నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నిరసనల సెగ తగిలింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టికెట్‌ను కేటాయించడం పట్ల కాంగ్రెస్ క్యాడర్ భగ్గుమంటోంది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లికి టికెట్ ఇవ్వడం సరికాదంటూ మండిపడుతున్నారు.

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, బీఆర్ఎస్‌లో చేరిన తరువాత ఎన్నో అష్టకష్టాలు పడుతూ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, ఇప్పుడు మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోతోన్నామంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు అభిమానులు.

కొల్లాపూర్ నియోజకవర్గం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అక్కడ అతికించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వంటి నాయకుల పోస్టర్లను చించివేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకుల వద్ద కోట్ల రూపాయలను తీసుకుని టికెట్లను అమ్ముకున్నారంటూ ఆరోపిస్తోన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+