Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బండికి పదవి వెనుక, ప్రధాని టూర్ లో ఏం జరిగింది - ఆయనే ఇక మంత్రి..!?

తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బండికి పార్టీ జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన వేళ ప్రధాని పర్యటన పూర్తయిన వెంటనే ఈ నిర్ణయం వెలువడింది. దీంతో కేంద్ర మంత్రిగా బండికి ఛాన్స్ లేనట్లేనా. మరి తెలంగాణ నుంచి ఇప్పుడు కొత్తగా కాబోయే కేంద్ర మంత్రి ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

బండికి పార్టీ పదవితో: ఎన్నికల వరకు బండి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. కానీ, బండి మార్చారు. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బండి పైన పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేసిన ఫిర్యాదుల ఫలితమే ఈ మార్పు అనే చర్చ సాగుతోంది. దూకుడుగా ఉండే బండిని కాదని..సౌమ్యుడిగా ఉండే కిషన్ రెడ్డి ఎన్నికల వేళ పార్టీ పగ్గాలు సరి కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

After Bandi appoints in BJP National committee, Dr Laxman may replace Kishan Reddy in central Cabinet

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేడర్ కు అంతు చిక్కటం లేదు. పార్టీలో క్రియాశీలకంగా మారిన బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ప్రాధాన్యత కొనసాగిస్తారని నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు బండిని బీజేపీ జాతీయ కార్యవర్గంలో నియమిస్తూ తాజాగా నిర్ణయం వెలువడింది.

ప్రధాని పర్యటన వేళ: బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తరువాత జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలనేది ఆలోచనగా చెప్పారు. తాను కేంద్ర మంత్రి పదవి తీసుకొనేందుకు సిద్దంగా లేనని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తాను పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని..తనకు పదవులు వద్దని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు వచ్చారు.

After Bandi appoints in BJP National committee, Dr Laxman may replace Kishan Reddy in central Cabinet

పార్టీ సభలో బండి సంజయ్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. బండి ప్రసంగానికి వచ్చిన స్పందన పరిశీలించారు. భుజం తట్టి బండిని అభినందించారు. ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ, తెలంగాణ అధ్యక్షులుగా పని చేసిన సోము..బండిని జాతీయ కార్యవర్గంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

ఆయనకు లైన్ క్లియర్ అయిందా: బండికి పార్టీ పదవి ఇవ్వటంతో ఇక కేంద్ర కేబినెట్ లో అవకాశం లేనట్లే. ఇప్పుడు కిషన్ రెడ్డి మంత్రి పదవి నుంచి తప్పుకొని పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించాలి. ఈ సమయంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గం లో ఎవరికి స్థానం దక్కుతుందనే చర్చ మొదలైంది. ఎంపీలుగా ఉన్న వారిలో రాజ్యసభ నుంచి లక్ష్మణ్..లోక్ సభ సభ్యులుగా ఉన్న సోయం బాబూరావు, ధర్మపురం అర్వింద్ రేసులో ఉన్నారు.

After Bandi appoints in BJP National committee, Dr Laxman may replace Kishan Reddy in central Cabinet

ఢిల్లీ నుంచి తాజా సమాచారం మేరకు పార్టీ సీనియర్ నేత..ఓబీసీ విభాగం పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్ కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. లక్ష్మణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంటే మినహా బండికి కేబినెట్ మంత్రి పదవి లేనట్లే. దీంతో..ఇప్పుడు ఇక తెలంగాణ నుంచి మంత్రి పదవి ఎవరికనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+