బీజేపీలో జోష్ .. హైదరాబాద్ కు ఈటెల బృందం.. ఘన స్వాగతం, అడ్డుకున్న పోలీసులు
గతంలో టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలకాలని బీజేపీ శ్రేణులు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈరోజు బీజేపీలో చేరిన తర్వాత హైదరాబాద్ కు వచ్చిన ఈటెల రాజేందర్ ను ఎయిర్ పోర్ట్ లో ఆయన కొడుకు,కోడలు రిసీవ్ చేసుకున్నారు. ఈటెల రాజేందర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్న రమేష్ రాథోడ్ ,అశ్వద్ధామ రెడ్డి, రవీందర్ రెడ్డి ,తుల ఉమ కూడా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం పలకాలని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు భారీగా బీజేపీ కార్యకర్తలు అభిమానులు చేరుకోగా,వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన ఈటెల రాజేందర్ కు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .అయితే బీజేపీ కార్యకర్తలను ఎయిర్ పోర్ట్ లోనికి అనుమతించటానికి పోలీసులు నిరాకరించారు. అంతేకాదు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గాల అన్ని వైపులా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి బిజెపి నేతలను కార్యకర్తలను చెక్ పోస్టుల వద్దే అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ హైదరాబాద్ కు చేరుకున్న క్రమంలో ఈటెల రాజేందర్ ను బిజెపి నాయకులు ఘనంగానే స్వాగతించారు.












Click it and Unblock the Notifications