కాంగ్రెస్ జాబితాలో కొత్త ట్విస్టులు - ముఖ్య నేతల సీట్ల మార్పు..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారం..మేనిఫెస్టోలో బీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్దుల ప్రకటనకు సిద్దమైంది. ఇదే సమయంలో పార్టీలో చేరిన సీనియర్లకు సీట్లపైన ఇచ్చిన హామీల్లో మార్పులు జరుగుతున్నాయి. దీంతో, పార్టీ అగ్రనేత రాహుల్ నుంచి పిలుపు రావటంతో మాజీ మంత్రి తుమ్మల..పొంగులేటి ఢిల్లీ వెళ్లారు. ఇద్దరి సీట్లు మారినట్లు సమాచారం.
మారుతున్న లెక్కలు : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీపీఐ, సీపీఎంతో పొత్తుల్లో చర్చల్లో భాగంగా ఖమ్మం జిల్లా నేతల సీట్లలో మార్పులు చేస్తున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయించిన సీట్లు,..ఇప్పుడు పొత్తుల కారణంగా మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా నేతలు పాంగులేటి..తుమ్మలతో పార్టీ ముఖ్య నాయకత్వం చర్చించింది.

మాజీ మంత్రి తుమ్మలకు కేసీ వేణుగోపాల్ పిలుపుతో... ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా రాహుల్‌తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరిన రోజు తుమ్మలకు సమయం ఇవ్వలేక పోవడంతో... అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిచింది. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.
వామపక్షాలతో పొత్తు : ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాలో సీట్ల మార్పు గురించి వేణుగోపాల్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. తుమ్మల వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు పైన తొలుత హామీ పొందారు. అదే విధంగా పొంగులేటికి కొత్తగూడెం సీట్ల పైన హామీ దక్కింది. ఇప్పుడు పొత్తుల లెక్కల్లో భాగంగా కొత్తగూడెం, మంచిర్యాల సీట్లు సీపీఐకు కేటాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
అదే సమయంలో సీపీఎం పట్టుబడుతున్న మధిర, భద్రాచలం స్థానాల్లో సిట్టింగ్ లను కాదని ఇవ్వలేమని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో, తాజా మార్పులతో పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తుమ్మల ను ఈ సారి మంత్రి పువ్వాడ అజయ్ పైన ఖమ్మం నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఖమ్మం జిల్లాలో సీట్ల మార్పు : సీపీఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ, రెండు స్థానాలకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మైత్రి కారణంగా తెలంగాణలోనూ పొత్తు కొనసాగింపు దిశగా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. సీపీఎం ఖమ్మం జిల్లాలోని సీట్ల పైన పట్టుబడుతోంది.
దీంతో, రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో తుది నిర్ణయం జరగాల్సి ఉందని తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే ఏ సీటు ఖరారు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నెల 18న పార్టీ అభ్యర్దుల జాబితా విడుదలకు పార్టీ కసరత్తు చేస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications