aghori issue: అఘోరీ నాగసాధు సంచలనం.. తెలంగాణాలో బీభత్సం సృష్టిస్తానంటూ..

తెలంగాణ రాష్ట్రంలో అఘోరీ మాత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అఘోరి మాత వివిధ యూట్యూబ్ ఛానల్ లకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ ఒకదాన్ని మించిన ఒకటి సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఒంటిపై బట్టలు లేకుండా విభూతి రాసుకొని సంచరిస్తున్న ఈ అఘోరి ముత్యాలమ్మ ఆలయం పై దాడి జరిగిన సమయంలో అక్కడ ప్రత్యక్షమై అక్కడ ఒంటి కాలిపై నిలబడి పూజలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

ఇంటర్వ్యూ లతో అఘోరీ రచ్చ
ఇక అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అఘోరిమాత వ్యవహారం పైన ఆసక్తి నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ అఘోరి జీవితం గురించి ఆసక్తికర ఇంటర్వ్యూలను చేస్తున్నారు. ఈ క్రమంలో తాను శవాలను పీక్కు తింటానని, ఆత్మలతో మాట్లాడతానని రకరకాల కథలు చెబుతుంది అఘోరీ. అంతే కాదు తాను చుక్క మంచినీళ్లు తాగకుండా నెల రోజులు బ్రతికి చూపిస్తానని సవాల్ విసిరుతున్నారు.

Aghori issue aghori nagasadhu serious and said that she will create havoc in telangana

అఘోరీగా మారటం వెనుక రకరకాల కథలు
సహజంగా అఘోరాలు, అఘోరీలు మీడియాలో కనిపించడానికి మీడియాతో మాట్లాడటానికి అసలు ఇష్టపడరు. అయితే తెలంగాణలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న అఘోరీ మాత్రం పనిగట్టుకుని మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అంతేకాదు తాను అఘోరిగా ఎలా మారానో రకరకాల కథలు చెబుతున్నారు.

అఘోరీ గుట్టు రట్టు చేసిన యూట్యూబ్ ఛానల్స్
ఒక కారు కారు నిండా పుర్రెలు, చేతిలో స్మార్ట్ ఫోన్ తో హల్చల్ చేస్తున్న అఘోరి నాగసాధు నిజంగానే అఘోరీనా లేక కావాలని ఈ విధంగా నటిస్తుందా అన్న కోణంలో పలు యూట్యూబ్ ఛానల్స్ పరిశోధన చేసే చివరకు అఘోరి మహిళ కాదు ట్రాన్స్ జెండర్ అని తేల్చారు అఘోరీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు.

అఘోరీ అరెస్ట్ అంటూ ప్రచారం.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అఘోరీ
అయితే తన గురించి సోషల్ మీడియాలో ఫేక్ అఘోరిగా పబ్లిసిటీ కావడంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అఘోరి అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తాను ఫేక్ అఘోరి అంటూ ప్రచారం చేస్తున్నారని, వారి అంతం చూస్తానని రచ్చ చేశారు. కొంతమంది తనను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారని తనను ఎవరు అరెస్టు చేయలేదని తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి దమ్ముంటే తనను అరెస్ట్ చెయ్యాలని ఛాలెంజ్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలంటూ అఘోరి ఛాలెంజ్ విసిరారు. ఇక ఇదే సమయంలో బద్రీనాథ్లో ఒక ముఖ్యమైన పనితో తన గురువు దగ్గరకు వెళుతున్నట్టు చెప్పి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తానంటూ అఘోరి వెల్లడించారు. మొత్తంగా మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన అఘోరీే బద్రీనాథ్ వెళ్లి మళ్లీ వస్తానని చెప్పడం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తానంటూ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+