హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణికులకు శుభవార్త: లండన్‌కు నాన్‌స్టాప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. తమ వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఇంట్లో గణనాథుడి సందడి (ఫోటోలు)ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఇంట్లో గణనాథుడి సందడి (ఫోటోలు)

రద్దీ మార్గాల్లో ఎయిర్ బబుల్ సెక్యూర్ కింద..

రద్దీ మార్గాల్లో ఎయిర్ బబుల్ సెక్యూర్ కింద..

ఈ పరిస్థితుల మధ్య దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా అద్దిరిపోయే శుభవార్తను వినిపించింది. ఎప్పుడెప్పుడా అంటూ విమాన సర్వీసుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోన్న వారికి గుడ్‌న్యూస్ ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ వరకు విమాన సర్వీసులను నిషేధించినప్పటికీ.. రద్దీ మార్గాల్లో విమాన సర్వీసులను పునరుద్ధరిస్తోంది ఎయిరిండియా. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి లండన్‌కు విమానాలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

లండన్‌కు టేకాఫ్

లండన్‌కు టేకాఫ్

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఈ మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకు ఎయిరిండియాకు చెందిన ఏఐ 147 ఫ్లైట్.. టేకాఫ్ తీసుకుంది. హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఎయిండియా అధికారులు, విమానాశ్రయం ప్రతినిధులు లండన్‌ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ టు లండన్

హైదరాబాద్ టు లండన్

వారంలో రెండురోజుల పాటు ఎయిరిండియా విమానం హైదరాబాద్-లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం మధ్య రాకపోకలు సాగిస్తుంది. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఈ విమాన సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరిన ఏఐ 147 విమానం.. బ్రిటన్ కాలమానం ప్రకారం.. మరుసటి రోజు ఉదయం 7:30 నిమిషాలకు హీత్రూ విమానాశ్రయానికి చేరుకుంటుంది. మరో విమానం లండన్ విమానాశ్రయం నుంచి బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 9:45 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు 11:30 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ఎయిర్ బబుల్ కింద..

ఎయిర్ బబుల్ కింద..

ఇదివరకే ఎయిరిండియా తన విమాన సర్వీసులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఎయిర్ బబుల్ కింద పలు దేశాలకు విమానాలను నడిపిస్తోంది. బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్, బహ్రెయిన్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతర్, రష్యా, రువాండ, సెషెల్స్, శ్రీలంక, టాంజానియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఉజ్బెకిస్తాన్, అమెరికాతో భారత్ ఎయిర్ బబుల్ సెక్యూర్‌ను ఏర్పాటు చేసుకుంది.

కెనడా సెప్టెంబర్ వరకు గడువు పొడిగింపు..

కెనడా సెప్టెంబర్ వరకు గడువు పొడిగింపు..

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ప్రారంభమైన తొలి రోజుల్లో విధించిన నిషేధాన్ని కెనడా మళ్లీ పొడిగించింది. మరో నెలరోజుల పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. నిజానికి- కెనడా విధించిన ట్రావెల్ బ్యాన్ ఈ నెల 21వ తేదీన ముగియాల్సి ఉండగా.. దాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కెనడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువడించింది. ఈ నిషేధం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులకు మాత్రమే వర్తింప జేసింది. కార్గో సర్వీసులకు మినహాయింపును ఇచ్చింది. అవి యధాతథంగా రాకపోకలు సాగిస్తాయి.

Recommended Video

Mao Zedong : మిలియన్ల మంది చావు Great Leap Forward | Cultural Revolution || Oneindia Telugu
డీజీసీఏ బ్యాన్ పొడిగింపు..

డీజీసీఏ బ్యాన్ పొడిగింపు..

అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టంగా ఉంది. దేశం సరిహద్దులను దాటుకుని వెళ్లే కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను ఈ నెల చివరి వరకూ పొడిగించింది. ఈ మేరకు కిందటి నెల 30వ తేదీన ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమర్షియల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసినట్టయింది.

భారత విమాన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్‌ను కొనసాగిస్తోనన దేశాలు సానుకూలంగా స్పందించకపోవడం వల్లే డీజీసీఏ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary
Air India Flight took off from the Rajiv Gandhi International Airport at Hyderabad. Air India's non-stop flights will operate between the Hyderabad and London Airport twice a week as Monday and Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X