శంషాబాద్ పోర్ట్‌లో తాగుబోతుల రచ్చ: ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా, కాళ్లు పట్టుకొని క్షమాపణ
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తాగుబోతులు అర్ధరాత్రి రచ్చ చేశారు. ఓ ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తాగుబోతులు అర్ధరాత్రి రచ్చ చేశారు. ఓ ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వారు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ హోస్టెస్ పట్ల మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.

బాధితురాలు ధైర్యం చేసి సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల ఔట్ పోస్ట్ వద్దకు వెళ్లి సాయం అడిగింది. వారు నిందితులను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
మద్యం మత్తులో తప్పుగా ప్రవర్తించామని నిందితులు బాధితురాలి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు. నిందితులను బంజారాహిల్స్, అమీర్‌పేట, శ్రీనగర్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications