హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని జలవిహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పలువురు ప్రముఖులను సన్మానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లాసపూరిత వాతావరణం నెలకొని ఉందన్నారు.

ఇద్దరు చంద్రులు కలవడం నూతన శకానికి నాంది అని చంద్రబాబు, కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. చంద్రుల కలయిక ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందని ఆయన చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ కళాకారులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రామాయణంలో రావణాసుడి వధ ఈ విజయదశమి రోజునే జరిగిందన్నారు.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయానికి నిర్వచనంగా జరుపుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విజయం సాధిస్తుందన్నారు.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రలు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్‌తో పాటు చంద్రబాబుకూ దత్తన్న ఆహ్వానాలు అందించారు. గతేడాది దత్తన్న నిర్వహించిన అలయ్ బలయ్‌కి ఇద్దరు సీఎంలు హాజరైన విషయం తెలిసిందే.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

గవర్నర్ నరసింహాన్, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీసీఐ, సీపీఎం కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీజేఎల్‌పీ నేత కె.లక్ష్మణ్ హాజరయ్యారు.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

వీరితో పాటు తెలంగాణ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి, జీవిత, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఈటెల రాజేందర్, రమ్య శ్రీ, కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఇక అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయాలు, ఆట పాటలు, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలకు పెద్దపీట వేశారు.

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

దత్తన్న అలయ్ బలయ్: ఇద్దరు చంద్రులు మళ్లీ కలుస్తారా?

రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన కేంద్ర పథకాల ప్రదర్శన కూడా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం తెలంగాణ వంటలను కూడా సిద్ధం చేశారు. అలయ్ బలయ్ అంటే పరస్పర అవగాహన, స్నేహపూరిత వాతావరణం కోసం ఒకరినొకరు అలింగనం చేసుకోడమే.

English summary
Alai Balai Brings KCR, Naidu 'Together': Dattatreya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X