Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైభవంగా ‘అలయ్‌ బలయ్‌’ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు !!

మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో "అలయ్ బలయ్" సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ వేదికగా 20వ ఏడాది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. నాటి నుంచి విజయదశమి మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కళాకారులతో కలిసి వీహెచ్‌ డప్పు వాయించి సందడి చేశారు. ఈసారి 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను ప్రదర్శించే ఈ వేడుక ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం లను సత్కరించనున్నారు. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా కవులు, సామాజిక నేతలు సైతం పాల్గొన్నారు.

alay-bhalay-event-started-in-hyderabad-organised-by-ex-governor-dattatreya

పాల్గొన్న వారిలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్యే సుజనాచౌదరి ఉన్నారు. అలానే సీపీఐ నేత నారాయణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ వీరందరికి కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ఇక అలయ్ బలయ్‌కు వచ్చే అతిథుల కోసం 87 రకాల ప్రత్యేక తెలంగాణ వంటకాలు సిద్ధం చేశారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి రుచికరమైన వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సందేశమిచ్చారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోంది, ఇది సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతోందని కొనియాడారు. సోదరభావాన్ని పెంపొందించే వేడుక 'అలయ్‌ బలయ్‌' అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి తెలంగాణకు చెందిన గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తోందన్నారు. ప్రజల్లో ఐక్యత, సమాజ విలువలను వ్యాప్తి చేసేందుకు ఓ సామాజిక సమావేశంగా ఇది ఉపయోగపడుతోందని స్పష్టం చేశారు. అలయ్‌ బలయ్‌ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+