వాహనదారులకు అలర్ట్.. నేడు ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్‌లోని వాహనదారులకు ముఖ్య గమనిక...నేడు ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిననున్నట్లు అధికారులు తెలిపారు. నేడు (బుధవారం) డీఎస్‌సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సహా మంత్రులు, వీఐపీలు, 11 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పాల్గొననన్నారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎల్‌బీ స్టేడియం పరిధిలోని ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్‌విగ్రహం వైపు గా వుంటాయని అధికారులు తెలిపారు. అటుగా వచ్చే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్ లోకి మళ్లించనున్నట్లు తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వెళ్లే వాహనాలను గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు.

ఇక, సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు డైవర్ట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు నేటి మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8గంటల వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.
సీఎం చేతులమీదుగా..
హైదరాబాద్ జిల్లాలో ఎంపికైన 616 మంది డీఎస్సీ అభ్యర్థులు నేడు ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోన్నున్నారు. జిల్లాలో మొత్తం 878 పోస్టులుండగా, 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications