తెలంగాణా, ఏపీ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్... ఆ రైళ్ళు రద్దు!
తెలంగాణ రాష్ట్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలా చోట్ల మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న 3వ లైన్ల నిర్మాణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు రద్దు చేసింది. ప్రయాణికులకు ఈ నేపథ్యంలో అలర్ట్ జారీ చేసింది.
భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రద్దు
సిర్పూర్ కాగజ్నగర్ - సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను 11 రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పలుచోట్ల మూడవ ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్తున్నారు.

ఈ రైళ్ళు రద్దు
ఇక మరోవైపు ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా 30 రైళ్ళను వేర్వేరు తేదీలలో రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట డోర్నకల్ , డోర్నకల్ విజయవాడ, భద్రాచలం రోడ్డు విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
శాతవాహన, గోల్కొండ తో సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్ళు రద్దు
ఇక ఇదే సమయంలో శాతవాహన, గోల్కొండ తో సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్ళు వారం రోజుల నుంచి 11 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అంతే కాదు మరో 9 రైళ్ళను దారి మళ్ళించి నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ రద్దయింది.
వందే భారత్ ఆ తేదీలలో ఆలస్యం
అలాగే 10, 11, 15, 18, 20 తేదీలలో గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. ఇక 11,14,16,18,20 తేదీలలో విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ రద్దయింది. అంతేకాదు సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈనెల 19, 20 తేదీలలో 75 నిమిషాల పాటు ఆలస్యంగా నడవనుందని పేర్కొంది.
ప్రయాణికులకు అలెర్ట్
ఇక ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ 11, 14, 18, 19 తేదీలలో 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ అలెర్ట్ ను తెలుసుకుని ప్రయాణాలు చెయ్యాలంటే తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications