అఘోరీలంతా మహా కుంభమేళాలో.. కానీ ఈ అఘోరీ తెలంగాణలో.. మళ్ళీ రచ్చ షురూ!
దేశంలోని అఘోరీలు, అఘోరాలు అందరూ మహాకుంభమేళాలో సందడి చేస్తుంటే గతంలో తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేసిన అఘోరి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో రచ్చ మొదలు పెట్టింది. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించి ఆలయాలను సందర్శించిన అఘోరి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వింతైన తన ప్రవర్తనతో వార్తలలో నిలిచారు.
తెలంగాణాలో మళ్ళీ ప్రత్యక్షమైన అఘోరీ
రెండు తెలుగు రాష్ట్రాలలో అఘోరీ హంగామా సృష్టించారు. ఆలయాల దర్శన చేసుకోకుండా పోలీసులు తనను అడ్డుకున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేయడమే కాకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక గతంలో ఒక మారు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ సెన్సేషన్ సృష్టించిన అఘోరి మాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు.

కరీంనగర్ లో అఘోరీ హల్చల్
గత కొంతకాలంగా ఎవరికి కనిపించకుండా పోయిన అఘోరీ మాత తాజాగా కరీంనగర్ లో ప్రత్యక్షమయ్యారు. రెండు రోజులుగా కరీంనగర్ బైపాస్ రోడ్డు పక్కన అఘోరిమాత ఉంటున్నారు ఇక ఈరోజు ఉదయం పెద్దపల్లి వైపు వెళుతున్న అఘోరి మాతను కొందరు ఆకతాయిలు వెంట పడ్డారు. దాంతో కారు ఆపేసిన లేడీ అఘోరి వారితో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అఘోరీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
పోలీసుల ముందు అఘోరీ డిమాండ్
అయినప్పటికీ అఘోరి తన కారును కొంతమంది యువకులు ఢీకొట్టారని, తనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు తెలిపారు. తనను ఇబ్బంది పెడుతున్న వారి పైన చర్యలు తీసుకోవాలని అఘోరీ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో పోలీసులు అఘోరీకి సర్ది చెప్పి అక్కడ నుండి పెద్దపల్లి వైపు పంపించారు. మొత్తంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ హల్చల్ చేస్తున్న అఘోరి ముందు ముందు ఏం చేస్తుందో అని అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది.
అఘోరీ నిజమైన అఘోరీనేనా ?
ఇక ఇదే సమయంలో దేశంలోని అఘోరాలు, అఘోరీలు అంతా మహా కుంభమేళాలో పాల్గొంటున్న సమయంలో ఈ అఘోరీ తెలంగాణాలో ఏం చేస్తుంది అన్నది కూడా ప్రతీ ఒక్కరు చర్చిస్తున్నారు. అసలు ఈ అఘోరీ నిజమైన అఘోరీనేనా అని కూడా చర్చ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications