హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు త‌మ స‌ర్వేలో ''కామ‌న్‌''గా చెప్పిన విష‌యం ఒక‌టే??

|
Google Oneindia TeluguNews

స‌ర్వేల పేరుతో రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల‌తో మైండ్ గేమ్ ఆడుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన ఓట‌రు మ‌న‌సు చివ‌రి నిముషంలో కూడా మారిపోతుంద‌ని, అప్పుడు ఏ పార్టీకి ఓటు వేస్తారో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని, అటువంటిది రాజ‌కీయ పార్టీల‌న్నీ స‌ర్వేలు నిర్వ‌హించాం.. ఫ‌లితాలు ఇలావున్నాయి..? అధికారంలోకి రాబోతోంది త‌మ పార్టీనే అంటూ ఎలా చెప్ప‌గ‌లుగుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయా?

అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయా?


స‌ర్వే నివేదిక‌లు ఉప‌యోగించి తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌పార్టీపై మ‌రోపార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నాయ‌ని, ఒక పార్టీ ఆత్మ‌విశ్వ‌సాన్ని మ‌రోపార్టీ దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తోందనే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఈ మూడు పార్టీలు ప్ర‌జ‌ల్లో త‌మ ప‌రప‌తి పెరుగుతోంద‌ని చూపిస్తున్నాయి. ఈ స‌ర్వేల ప్ర‌క‌ట‌న‌లు ఓటర్ల‌ను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి.

మూడు పార్టీలు.. మూడు సర్వేలు..

మూడు పార్టీలు.. మూడు సర్వేలు..


టీఆర్ ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన సర్వే రిపోర్టులు లీక‌య్యాయి. తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌ని, కొద్దిచోట్ల ఎమ్మెల్యేల‌ను మార్చి కొత్త‌గా రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు ఇస్తే చాల‌ని ఈ స‌ర్వే చెప్పింది. ఇది జ‌రిగిన కొద్దిరోజుల‌కు కాంగ్రెస్ పార్టీ త‌న సొంత స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 'ఆత్మ సాక్షి' బృందం చేసిన సర్వేలో టీఆర్‌ఎస్ మెజారిటీ తగ్గింది. అయినా ఆ పార్టీనే అధికారాన్ని నిలబెట్టుకుటుంటుంద‌ని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌ని తెలిపింది.

ఓటర్లలో గందరగోళం

ఓటర్లలో గందరగోళం

ఈ స‌ర్వేలు ఇలా ఉండ‌గా టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిల‌బెట్టుకుంటుంద‌ని 'ఆరా' సంస్థ స‌ర్వేను బీజేపీ విడుద‌ల చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ బ‌దులు బీజేపీ రెండోస్థానంలో ఉంటుంద‌ని తెలిపింది. ఇవ‌న్నీ రాజ‌కీయ పార్టీలు ఆడుతున్న మైండ్‌గేమ్‌లో భాగ‌మేన‌ని, ఓట‌ర్ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేయ‌డంద్వారా త‌మ పార్టీపై వారికి గురికుదిరేలా చేస్తున్న‌ర‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు సైతం చెబుతున్నారు. ఈ స‌ర్వే ఫ‌లితాల‌వ‌ల్ల పార్టీ మారాల‌నుకునేవారిని అయోమ‌యానికి గురిచేస్తాయ‌ని, వీలైనంత‌మందిని త‌మ త‌మ పార్టీల్లోకి ఆహ్వానించేలా ఉంటాయ‌ని చెబుతున్నారు.

ఈ స‌ర్వేలు ఎన్నిసార్లు ఎన్ని ఫ‌లితాలు విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ ఒక విష‌యం మాత్రం కామ‌న్‌గా ఉంటోంది. అదేమిటంటే.. టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కాంగ్రెస్ స‌ర్వే, బీజేపీ స‌ర్వే కూడా ఇదే చెబుతోంది.

English summary
TRS, Congress and BJP parties have said the same thing as "common" in their survey.. TRS will come back to power..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X