హరీష్! కేసీఆరే వాళ్ల కాళ్లు కడగాలి, ఇన్ని మాటలు తప్పారు: అలీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ బుధవారం నాడు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో మాట తప్పారని ధ్వజమెత్తారు.
పార్టీని విలీనం చేస్తానని చెప్పిన నుంచి మొదలు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న ప్రతి మాటలోను మోసం చేశారని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం కోసం కాంట్రాక్టర్ దొరుకుతారు కానీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి దొరకడం లేదా అని ప్రశ్నించారు.
దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పారని, ఆ మాట తప్పారన్నారు. అలాగే ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారని దాని విషయం ఏమయిందో చెప్పాలని నిలదీశారు. తెరాస అంటేనే మోసగారి పార్టీ అన్నారు.
మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది బాధాకరమన్నారు. వాగ్దానాలు నిలుపుకోలేని మీరే ప్రజల కాళ్లు కడగాలన్నారు. ముఖ్యమంత్రి మాట తప్పారని, కాబట్టి ప్రజల కాళ్లు కడగాలన్నారు. మేనిఫెస్టోలోని అంశాల పైన తాము అసెంబ్లీలో కడిగేస్తామన్నారు.












Click it and Unblock the Notifications