రేపు మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు..!!
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది. మొత్తం 52 మంది అభ్యర్దులు పోటీ చేస్తున్న ఈ ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. లింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 48 గంటలపాటు వైన్ షాపులు బంద్ చేశారు.
27వ తేదీన ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగింటికి ముగియనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52మంది బరిలో ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications