వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపురేఖలే మారిపోతున్నాయి - తెలంగాణాలో కొత్త పండుగ..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 'మన ఊరు- మన బడి','మన బస్తీ-మన బడి'. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాల రూపురేఖలు మార్చే కార్యక్రమం. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లోనూ 12 రకాల వసతులతో తీర్చి దిద్దుతున్నారు. ఇందుకోసం 7,289 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ఆమోదం తెలిపారు. తొలి విడతలో రూ.3,497.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రేపు (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో 'మన ఊరు- మన బడి' ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు..అధికారులు కార్యక్రమ నిర్వహణ పైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

20 లక్షల మంది విద్యార్ధుల కోసం..

20 లక్షల మంది విద్యార్ధుల కోసం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి.. విద్యార్ధులకు మెరుగైన వసతుల మధ్య బోధన కొనసాగాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే.. 12 రకాల నూతన వసతులతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దేందుకు ప్రతిష్ఠాత్మకంగా 'మన ఊరు- మన బడి','మన బస్తీ-మన బడి' కార్యక్రమం రూపొందించారు. రాష్ట్రంలో ఉన్న 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 19,84,167 మంది విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించటంతో పాటుగా నాణ్యమైన విద్య అందించటం ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం. విద్యార్దుల హాజరు పెంచేలా చర్యలతో పాటుగా వారికి దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. తద్వారా విద్యార్ధుల్లో సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటు దిశగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు.

మొత్తం రూ 7,289 కోట్లతో మూడేళ్లలో పూర్తిగా..

మొత్తం రూ 7,289 కోట్లతో మూడేళ్లలో పూర్తిగా..

మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు సమయంగా నిర్దేశించుకున్నారు. ఇందు కోసం 7,289 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ఖరారు చేసారు. ఈ ప్రతిష్ఠాత్మక పథకం అమలు కోసం ప్రభుత్వం గతంలో నియమించిన మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నాణ్యమైన విద్యా బోధనతో పాటుగా మెరుగైన మౌళిక వసతుల కల్పన పై పలు సూచనలు చేసింది. వీటికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఫలితంతా మూడేళ్ల కాలంలో..మూడు విడతులగా రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమలుకు నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి 40% నిధులను, పంచాయితీరాజ్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లలో కొంత శాతం నిధులను ఈ పథకం కోసం కేటాయించనున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రూ.కోటి, అంతకుమించి ఆర్థిక సహాయం చేస్తే.. దాతలు సూచించిన పేరును ఆ పాఠశాలకు, రూ.10 లక్షలకు పైగా సహాయం అందిస్తే దాతలు సూచించిన పేరును ఒక తరగతి గదికి పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు.

రేపు తొలి విడత ప్రారంభ వేడుక

రేపు తొలి విడత ప్రారంభ వేడుక

మొదటి విడతలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. వీటిని రేపు (మంగళవారం) ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. ఒకే నియోజకవర్గంలో పనులు పూర్తయిన పాఠశాలలు అధికంగా ఉంటే తదుపరి రోజుల్లో ప్రారంభించుకోవచ్చని చెప్పారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతో సమన్వయం చేసుకొని పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాల్లో పేరెంట్స్‌ కమిటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేస్తున్నారు.'మనఊరు -మన బడి, 'మన బస్తీ-మన బడి' ప్రారంభోత్సవాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ప్రారంభించే బడులు, ఏ జిల్లాలో ఎవరెవరు ప్రారంభిస్తారన్న అంశాలను ఇందులో సమీక్షించే అవకాశం ఉంది.

English summary
Telangana Govt to launch Man Vooru Mana Badi First phase on 1st February, Directions issues for MLAs and Officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X