మహాశివరాత్రి వేళ శ్రీశైలంకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్గాలు.. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసారు. ఇక, శ్రీశైలం కు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేసారు.
బ్రహ్మోత్సవాల వేళ
శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా.. తాజా నిర్ణయాలకు సహకరించాలని పోలీసు అధికారులు భక్తులు సూచనలు చేసారు.
క్షేత్రానికి వచ్చే వాహనాల కోసం శిఖరం వద్ద నుంచి ముఖద్వారం, సాక్షి గణపతి, హటకేశ్వరం, రామయ్య టర్నింగ్ టోల్‌గెట్, శ్రీశైలంలోని పరిసర ప్రాంతాలు, శ్రీశైలం ముఖద్వారం నుంచి సున్నిపెంట, లింగాలగట్టు, తెలంగాణ బోర్డర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సుమారు 800 మందిని ట్రాఫిక్ నియంత్రణ కోసం సిబ్బందిని నియమించారు.

ప్రత్యేక ఏర్పాట్లు
రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, అవాంఛ నీయ సంఘటనలు జరుగకుండా ఎనిమిది డ్రోన్ కెమెరాలతో నిఘా సిబ్బంది మొహరించారు. ముఖ్య కూడళ్లలో పికెట్స్ ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రానికి వచ్చే భక్తులు పలు సూచనలు పాటించా లని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. దోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఘాట్‌రోడ్డు కారణంగా వాహనాల్లో వచ్చే సమయంలో నైపుణ్యం ఉన్న డ్రైవర్లను వెంట తీసుకురావాలని సూచించారు. భారీ గూడ్స్ వాహనాలు శ్రీశైలం వరకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యం గా సాక్షి గణపతి రామయ్య టర్నింగ్ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలుపొద్దని కోరారు.
భక్తులకు సూచనలు
దీనికి కొనసాగింపుగా ఔటర్ రింగ్ రోడ్డు యజ్ఞశాల ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఇతర బస్సుల కోసం విశాలంగా పార్కింగ్ సిద్దం చేసారు. ఔటర్ రింగ్ రోడ్డు కొత్త పార్కింగ్ స్థలం వద్ద కార్లు, తేలిక పాటి వాహనాలు నిలిపేందుకు మరో పార్కింగ్ కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మాత్రమే వాహనాలను నిలపాలని.. ఎవరైనా రోడ్డుపై వాహనాలు ఆపితే టోయింగ్ యంత్రం ద్వారా తొలగించి.. ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారు లు వెల్లడించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications