కొలిక్కి వచ్చిన కేబినెట్ విస్తరణ..రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి ఆ నలుగురు ..?

తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి దాదాపు యేడాదిన్నర కావొస్తోంది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతుల చేపట్టిన విషయం తెలిసిందే.హోం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, విద్య, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కీలక శాఖలను రేవంత్‌ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు. అయితే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆ దిశగా అడుగులు వేయలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

దీంతో క్యాబినేట్ విస్తరణ వాయిదా పడింది.క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయాలని ఆయన నిర్ణయించారు.దీనిలో భాగంగానే ఆయన సోమవారం ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని చర్చించుకుంటున్నారు.

all set for Revanth Reddy cabinet expansion final list goes viral

ప్రస్తుతం నలుగురితోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్‌ ఉన్నారు.నిజామాబాద్‌ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదన్న చర్చ నడుస్తోంది.ఇక మంత్రివర్గంలోకి వచ్చే అవకాశాలున్న మరో పేరు మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి. తెలంగాణలో బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు కూడా మంత్రి రేసులో వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోకి చేరారు. అయిత ఆ సమయంలో మంత్రివర్గ హామీతోనే పార్టీలో చేరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాజగోపాల్‌ రెడ్డి సోదరుడు వెంకట్‌ రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి, మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్‌ వంటి వారి పేర్లు కూడా మంత్రి రేసులో వినిపిస్తున్నాయి. దీనిపై ఒకటి , రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+