వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: దేశానికే దిక్సూచీగా - సీఎం కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. గవర్నర్ ..సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ జరిగే కార్యక్రమాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. నేటి వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు వేడుకలు నిర్వహించలేదు. ఈ రోజు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి

సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి

పబ్లిక్‌ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్‌ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మంది తెలంగాణ బిడ్డలను గవర్నర్‌ సన్మానించనున్నారు. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం అధికారికంగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

ఢిల్లీలో అమిత్ షా - రాజ్ భవన్ లో గవర్నర్

ఢిల్లీలో అమిత్ షా - రాజ్ భవన్ లో గవర్నర్


ప్రత్యేక రాష్ట్రం కోసం యువత చేసిన త్యాగాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన వారికి గవర్నర్‌ నివాళులర్పించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. ఎనిమిదేళ్ల కాలంలో ఊహించనంత సంక్షేమం, అభివృద్ధి సాధించిందని సీఎం చెప్పుకొచ్చారు. దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తోందన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ గుణాత్మక అభివృద్ధి నమోదు చేస్తోందని సీఎం పేర్కొన్నారు.

ఆవిర్భావ దినోత్సవం నాడు..కొత్తగా

ఆవిర్భావ దినోత్సవం నాడు..కొత్తగా

విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి జరిగిందని తెలిపారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న పురస్కారాలే సాక్ష్యమన్నారు. రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం.. ఆటంకం కలిగిస్తున్నా ముందుకు వెళ్తున్నామన్నారు. మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసారు. అన్ని జిల్లాల్లోనూ అధికారికంగా సంబురాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇదే రోజున తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ కొత్త జిల్లా కోర్టులు ప్రారంభం కానున్నాయి.

English summary
All set for Telangana formation day celebrations by govt . CM KCR participate in celebrations in public gardens. Governor wishes on this occassion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X